Kadapa: పరిటాల రవి హత్య కేసు దోషులు విడుదల

by srinivas |   ( Updated:2024-12-20 08:17:42.0  )
Kadapa: పరిటాల రవి హత్య కేసు దోషులు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసు దోషులు విడుదల అయ్యారు. కడప సెంట్రల్ జైలులో18 ఏళ్ల పాటు శిక్ష అనుభవించారు. వీరికి బెయిల్ మంజూరు కావడంతో తాజాగా జైలు నుంచి విడుదలయ్యారు. దోషులు నారాయణ రెడ్డి, ఓబి రెడ్డి, రంగనాయకులు, ఒడ్డే కొండా కడప సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. మరో దోషి రేఖమయ్య విశాఖ జైలు నుంచి విడుదల కానున్నారు.

కాగా 2005 జనవరి 24న అనంతపురం టీడీపీ జిల్లా కార్యాలయంలో పరిటాల రవి హత్యకు గురయ్యారు. కార్యకర్తలతో సమావేశంలో ఉండగానే ఆయనపై మొద్దు శీను, రేఖమయ్య, నారాయణరెడ్డి కాల్పులు జరిపారిరు. ఓబిరెడ్డి, రంగనాయకులు, వడ్డే కొండ తదితరులు పార్టీ కార్యాలయం బయట బాంబులు వేసి కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేశారు. కాల్పుల్లో పరిటాల రవితో పాటు ఆయన గన్ మెన్, ధర్మవారానికి చెందిన ఆయన అనుచరుడు మృతి చెందారు. ఈ హత్య కేసులో 16 మందిని నిందితులుగా చేర్చగా కోర్టు నలుగురు నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో మిగిలిన 12 మందిలో ఒకరు రామ్మోహన్ రెడ్డి అప్రూవర్‌గా మారారు. అయితే మొద్దు శీను, మరో దోషి కొండారెడ్డి విచారణ సమయంలో హత్యకు గురయ్యారు. మిగిలిన దోషులకు బెయిల్ మంజూరు కావడంతో జైలు నుంచి విడుదల అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed