వరి ధాన్యంలో తేమ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

by Naveena |
వరి ధాన్యంలో తేమ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
X

దిశ ,పెబ్బేరు: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన వరి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. శుక్రవారం పెబ్బేరు మండల పరిధిలోని పెబ్బేరు మార్కెట్ యార్డు, కంచిరావు పల్లి ఐ.కే.పి, సహకార సంఘాల ద్వారా నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ సందర్శించారు. ధాన్యం సేకరణ నిబంధనల ప్రకారం జరగాలని, తేమ, తాలు, చెత్త లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులను సూచించారు. సేకరించిన ధాన్యాన్ని నిర్దేశించిన మిల్లులకు ఎప్పటికప్పుడు తరలించాలని, అదేవిధంగా ఆన్లైన్ లో నమోదు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. అకస్మాత్తుగా వచ్చే వర్షాల నుండి ధాన్యానికి రక్షణ కల్పించే విధంగా టార్పాలిన్ లు అందుబాటులో ఉంచుకోవాలని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed