మేడమ్.. ఆమె 28 ఏళ్ల ఒంటరి మహిళ.. 52 ఏళ్ల నాకు తనతో శృంగారం చేయాలనిపిస్తుంది తప్పంటారా..?

by Bhoopathi Nagaiah |
మేడమ్.. ఆమె 28 ఏళ్ల ఒంటరి మహిళ.. 52 ఏళ్ల నాకు తనతో శృంగారం చేయాలనిపిస్తుంది తప్పంటారా..?
X

మేడమ్. నా వయసు 52 సంవత్సరాలు. నాకు ముగ్గురు ఆడపిల్లలు. ఈ మధ్య 28 సంవత్సరాల డైవోర్స్ తీసుకున్న అమ్మాయితో పరిచయం అయింది. తనకు ముగ్గురు పిల్లలు. వంటరిగా ఉంటుంది. ఆమె నాతో చనువుగా ఉంటూ మీరే నాకేదైనా దారి చూపాలి సార్ అంటుంది. నా దగ్గర డబ్బులు తీసుకుంటుంది. నేను ఆమెతో సంబంధంలోకి వెళితే రోగాలేమైనా వస్తాయన్న భయంతో పాటు నన్ను ప్రాణ సమానంగా ప్రేమించే భార్య, పిల్లలకి ద్రోహం చేస్తున్నానేమో అనే భయం వెంటాడుతున్నది. ఆలోచనలతో రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదు. నన్నేం చేయమంటారు. మీరు చెప్పిందే నేను పాటిస్తాను. - వినయ్ చౌదరి, అల్వాల్, సికింద్రాబాద్.

బిడ్డ వయసున్న అమ్మాయి. భర్త తోడులేని అమ్మాయి మీలో తండ్రినో, అన్ననో చూసుకుంటుందని ఎందుకు అనుకోరు? మీ ఆడపిల్లలకే ఈ సమస్య వస్తే ఎలా ఉంటుంది? ఆమెకు దూరంగా ఉండండి. ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవాలన్న దుర్బుద్ధితోనే ఆమెకు డబ్బు సాయం చేస్తున్నారు. నిస్సహాయ, ఒంటరి స్త్రీలను చూస్తే పురుషులలో కొందరికి ఈ రకమైన చులకన భావం, తక్కువ బుద్ధి కలుగుతాయి. మీకూ ఆడబిడ్డలున్నారు గుర్తు పెట్టుకోండి. ఆమెకి రోగాలున్నాయని ఎలా చెప్పగలరు? వంటరి స్త్రీలు ఏమీ తిరుగుబోతులు కారు. భర్త లేకపోయినా నీతీనిజాయితీ, నిబద్ధతతోనే బతుకుతారు. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉంటారు. మీలాంటి అవకాశవాదులు, గోతికాడ గుంటనక్కలు దుర్బుద్దితో వాళ్ల వ్యక్తిత్వాన్ని కించపరుస్తారు. మీ జాగాలో మీరు ఉండండి. డబ్బు అడిగితే ఇవ్వకండి. ఏదైనా ఉద్యోగం చేసి జీవించవచ్చు అనే ఆలోచన ఆమెలో కలిగించి లేదా ఒక సోదరుడిలాగా, తండ్రిలాగా ఆమెకు ఉద్యోగం ఇప్పించి మీరు హుందాగా తప్పుకోండి.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed