మీరు వర్జినా అని డైరెక్ట్‌గా అడిగిన నెటిజన్.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన ప్రభాస్ బ్యూటీ(ట్వీట్)

by Kavitha |   ( Updated:2025-03-15 13:43:18.0  )
మీరు వర్జినా అని డైరెక్ట్‌గా అడిగిన నెటిజన్.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన ప్రభాస్ బ్యూటీ(ట్వీట్)
X

దిశ, వెబ్‌డెస్క్: ‘బట్టం బోలే’(Battam bole) అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాళవిక మోహనన్(Malavika Mohanan).. తన ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అయిపోయింది. అలాగే తన నటనతో కూడా బాగా క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీ కాంత్(Rajinikanth) సరసన ‘పేట’(Peta) మూవీలో నటించి మెప్పించింది. ఈ సినిమాతో ఈ భామ గ్రాఫ్ చేంజ్ అయిపోయిందని చెప్పవచ్చు. దీంతో వరుస అవకాశాలు తలుపు తట్టాయి. అలా వచ్చిన అన్ని చిత్రాల్లో నటించింది.

ఆ తర్వాత కోలీవుడ్‌లోనూ స్టార్ హీరో సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే రీసెంట్‌గా ‘తంగలాన్’(Thangalan) సినిమాతో అలరించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇందులో భాగంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) సరసన ‘రాజా సాబ్’(Raja Saab) సినిమాతో మన ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి(Maruti) దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో మాళవికతో పాటు ప్రభాస్‌తో నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ది కుమార్‌(Riddi Kumar)లు కూడా రొమాన్స్ చేయబోతున్నారు. సంజయ్ దత్(Sanjay Dutt), అనుపమ్ ఖేర్(anupam Kher) వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి తమన్(Thaman) సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో అదరహో అనిపిస్తుంది.

ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది ఈ ముద్దుగుమ్మ . అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది ఈ చిన్నది. అయితే ఓ నెటిజన్ మాళవికాను డైరెక్ట్‌గా మీరు వర్జినా అని క్వశ్చన్ చేశాడు. దానికి మాళవిక.. ఈ రకమైన చెత్త ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు. ఇలాంటివి అడగడం మానేయండి అని గట్టిగా ఇచ్చిపడేసింది. ప్రస్తుతం మాళవిక మోహనన్ ట్వీట్ వైరల్ అవుతోంది.



Next Story

Most Viewed