- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. స్పాట్‌లోనే నలుగురు దుర్మరణం

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఇద్దరు అక్కడిక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని కృష్ణా జిల్లా (Krishna District)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఘంటసాల (Gantasaala) మండల పరిధిలోని జీలగలగండి (Jilagalagandi) వద్ద ఎదురుగా వస్తున్న లారీని మినీ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం (Postmortem) నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లుగా పోలీసులు వెల్లడించారు.
అన్నమయ్య జిల్లాలో..
రెండు లారీలు ఢీకొని ఇద్దరు డ్రైవర్లు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయి ఘటన అన్నమయ్య జిల్లా (Annamayya District)లో చోటుచేసుకుంది. కురబలకోట (Kurubala Kota) మండల పరిధిలోని తానామిట్ట (Thanamitta) సమీపంలోని అడవిపల్లె (Adavipalle) వద్ద ఎదురెదురుగా వస్తున్న లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్‌లో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయారు. అటుగా వెళ్లే వాహనదారుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జేసీబీ సాయంతో వెలికితీశారు.