- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mohanlal: ఆ సినిమా పరాజయం నన్ను ఎంతో భాదించింది.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) స్వీయ డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్’ (Burroughs: Guardian of Treasure). పూర్తిగా 3డిలో వస్తున్న ఈ మూవీ మైథలాజికల్ థ్రిల్లర్ (Mythological Thriller)గా జీజో పున్నూసే రచించిన నవల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇక రిలీజ్ సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్ (Promotions)లో జోరు పెంచారు చిత్ర బృందం.
ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్ లాల్ సినిమా కథల ఎంపికలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘కథలు ఎన్నో విన్నప్పటికీ నా మనసుకు నచ్చిన స్టోరీనే ఎంచుకుంటాను. అలా చేసిన చిత్రమే ‘మలైకోటై వాలిబన్’ (Malaikotti Valiban). ఈ కథను ఎంతో నమ్మి.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాం. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం గతేడాది రిలీజై నిరాశకు గురిచేసింది. ఆ మూవీ రిజల్ట్ విషంలో నాకంటే ఎక్కువగా నా ఫ్యాన్స్ బాధపడ్డారు. ఒక సినిమా ఫెయిల్ అయ్యిందంటే నటుడునే తప్పు పడతారు. ఎందుకంటే సినిమా కథల ఎంపికలో ఎంతో శ్రద్ధ పెట్టాల్సిన అవసరం నటుడిపై ఉంటుంది. కొత్త డైరెక్టర్లు ఎవరైనా నా దగ్గరకు వచ్చి కథులు చెప్పినప్పుడు వాళ్లలో నన్ను చూసుకుంటాను. ఎందుకంటే విభిన్నమైన కథలు చెప్పాలనే వారి తపన నాకు అర్థం అవుతోంది’ అని చెప్పుకొచ్చారు.