Pushpa-2: బాలీవుడ్‌లో ‘పుష్ప-2’ సరికొత్త రికార్డ్.. సెకండ్ ప్లేస్‌లో ఏ సినిమా అంటే?

by sudharani |   ( Updated:2024-12-20 16:29:00.0  )
Pushpa-2: బాలీవుడ్‌లో ‘పుష్ప-2’ సరికొత్త రికార్డ్.. సెకండ్ ప్లేస్‌లో ఏ సినిమా అంటే?
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’ (Pushpa-2) బాలీవుడ్‌ (Bollywood)లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. 100 ఏళ్లు కలిగిన బాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ (first time) ఒక డబ్బింగ్ మూవీ (dubbed movie) హిందీ సినిమా కంటే అత్యధిక వసూళ్లను రాబట్టి.. అక్కడ రికార్డ్ క్రియేట్ చేసింది. ‘పుష్ప-2’ చిత్రం తాజాగా రూ. 1500 కోట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇందులో వరల్డ్ వైడ్‌ (world wide)గా రూ. 900 కోట్లు రాగా.. కేవలం హిందీలోనే రూ. 632 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది. దీంతో ఫస్ట్ టైమ్ రూ. 632 కోట్లు రాబట్టిన హిందీ సినిమాగా పుష్ప-2 నిలిచింది.

ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘100 సంవత్సరాల బాలీవుడ్ చరిత్రలో పుష్ప2 కొత్త రికార్డ్ సృష్టించింది. ‘పుష్ప-2: ది రూల్’ కేవలం 15 రోజుల్లో అతిపెద్ద హిందీ నెట్‌గా మారింది’ అంటూ తెలిపారు. అయితే.. మొదట బాలీవుడ్‌లో ఎక్కువ వసూళ్లు రాబట్టిన రికార్డును ‘స్త్రీ-2’ (Stree-2) దక్కించుకుంది. ఈ చిత్రం రూ. 625 కోట్లు వసూళ్లను సాధించింది. ఇప్పుడు స్త్రీ-2 క్రియేట్ చేసిన రికార్డును బద్దలు కొడుతూ.. పుష్ప-2 రూ. 632 కోట్లు రాబట్టి మొదటి స్థానంలో నిలిచింది. దీంతో స్త్రీ-2 సెకండ్ ప్లేస్‌లో ఉంది.

Advertisement

Next Story

Most Viewed