ఎస్బీఐ ఆధ్వర్యంలో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ప్రాపర్టీ షో

by Aamani |
ఎస్బీఐ ఆధ్వర్యంలో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ప్రాపర్టీ షో
X

దిశ, శేరిలింగంపల్లి : మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాపర్టీ షో కి ముఖ్య అతిథిగా హాజరైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సీజియం రాజేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుందని, హైదరాబాద్ లో సొంతింటి కల సాకారం చేసుకోవడానికి ఈ ప్రాపర్టి షో దోహదం చేస్తుందన్నారు. ఈ ప్రాపర్టీ షో లో నగరంలోని పలు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు స్టాల్స్ ను ఏర్పాటు చేశాయి.

మూడు రోజుల జరిగే ప్రాపర్టీ షోకు నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు స్టాల్స్ సందర్శించి నచ్చిన నిర్మాణ సంస్థలో తమ నివాసాన్ని బుక్ చేసుకుంటే బ్యాంకు పరంగా లోన్ పరంగా ఇక్కడే మంజూరు చేయడం జరుగుతుందన్నారు. హైదరాబాద్ లోని టాప్ బిల్డర్ అందరూ ఇందులో పాల్గొంటున్నారని, క్రెడాయి, నరేడ్కో కు సంబంధించిన బిల్డర్స్ అందరూ పాల్గొంటున్నారన్నారు. సుమారుగా 500 వరకు ప్రాపర్టీస్ ఇందులో డిస్ప్లే చేశామని, ఎస్బిఐ ద్వారా వెంటనే లోన్ సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు. ఇళ్లు కొనాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశమని, హైదరాబాద్ కు మంచి భవిష్యత్ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిల్డర్లు, ఇన్వెస్టర్లు, సందర్శకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed