- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్..
by Aamani |
X
దిశ, తంగళ్ళపల్లి: విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పాఠశాలకు ఆనుకొని ప్రమాదకరంగా ఉన్న.. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. పాఠశాల గోడకు ఆనుకొని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఉండడంతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆనుకొని ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం ఉంది.
సంబంధిత అధికారులకు విద్యుత్ బిల్లులను వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ పాఠశాల వద్ద ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ని సరి చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. పాఠశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలని తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కోరుతున్నారు.
Advertisement
Next Story