మరియాపుల్‌పై శక్తివంతమైన బాంబుల ప్రయోగం

by Mahesh |
మరియాపుల్‌పై శక్తివంతమైన బాంబుల ప్రయోగం
X

కీవ్: మరియాపుల్‌లో రష్యా దాడులు మరింత తీవ్రతరం చేసింది. ఓ వైపు ప్రజల తరలింపుకు రెస్కూ చర్యలు కొనసాగుతున్న సమయంలో రెండు శక్తివంతమైన బాంబులు ప్రయోగించినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. 200,000 కంటే ఎక్కువ మంది ప్రజలు వ్యూహాత్మక నగరంలో చిక్కుకున్నారని స్థానిక అధికారులు చెప్పారు. తప్పించుకునే ప్రయత్నం చేసిన వారిలో చాలా మంది మరణిస్తున్నారని వెల్లడించారు.

అయితే ప్రతి ఒక్కరినీ తరలించడం సాధ్యం కాకపోయిన, అన్ని ప్రయత్నాలు చేస్తామని డిప్యూటీ పీఎం ఇరీనా వెరెష్ చుక్ వీడియో ప్రసంగంలో తెలిపారు. ఆక్రమణదారులు మరియా పూల్ ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించట్లేదని, నగరాన్ని నేలమట్టం చేసి, బూడిదగా మార్చాలని చూస్తున్నారని స్థానిక అధికారులు అన్నారు.

Advertisement

Next Story