- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుణె ఎయిర్‌పోర్టులో పేలిన 'సుఖోయ్ ఫైటర్' టైరు
by Harish |
X
ముంబై: పుణె అంతర్జాతీయ విమానశ్రయంలో సుఖోయ్ ఫైటర్ జెట్‌కు పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో టైర్ పేలడంతో రన్ వేను బ్లాక్ చేశారు. దీంతో రెండు గంటల పాటు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో విమానాలను ముంబై, ఇతర ప్రాంతాలకు మళ్లించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. దీంతో షెడ్యూల్ ప్రయాణాలు కూడా ఆలస్యమైనట్లు తెలిపింది. భారత వైమానిక దళ సిబ్బంది రన్‌వేని క్లియర్ చేసి, అవసరమైన తనిఖీల తర్వాత ఫ్లయింగ్ ఆపరేషన్‌ల కోసం తెరిచారు. ఈ మేరకు స్పైస్ జెట్ ట్వీట్ చేసింది. 'పూణే రన్ వే మధ్యాహ్నం 3.30 గంటల వరకు మూసివేయడంతో, అన్ని ప్రయాణాలపై ప్రభావం పడింది' అని ట్వీట్ చేసింది. కాగా, పూణె విమానాశ్రయం రన్ వే కార్యకలాపాలను భారత వాయు దళం నిర్వహిస్తుంది.
Advertisement
Next Story