తల్లిని అలా చూసేసరికి.. తట్టుకోలేక కూతురు ఆత్మహత్య

by Web Desk |
తల్లిని అలా చూసేసరికి.. తట్టుకోలేక కూతురు ఆత్మహత్య
X

దిశ, అల్వాల్: తీవ్ర మానసిక ఒత్తిడితో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం రాత్రి అల్వాల్​ పోలీస్​స్టేషన్​పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదేవి నగర్​కు చెందిన లత కూతురు రేవతి(28)కి మల్కాజిగిరిలోని గౌతంనగర్​కు చెందిన కిరణ్​తో గత సంవత్సరం అక్టోబర్​లో వివాహం అయింది. గత కొంతకాలంగా రేవతి తల్లి లతకు తీవ్రమైన ఆనారోగ్యంతో బాధపడుతుంది. దీంతో చికిత్సపొందుతున్న తల్లిని చూడడానికి రేవతి గత 16న భూదేవి నగర్​లోని తల్లిగారింటికి వచ్చింది.

తల్లి ఆరోగ్య పరిస్థితిని చూసి జీర్ణించుకోలేక రేవతి తీవ్ర మానసిక వేదనకు గురై ఇంట్లోకి వెళ్లింది. ఎంతసేపయిన బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన బంధువులు తలుపు తట్టినా అలికిడి కాకపోవడంతో స్థానికుల సహాయంతో ఇంటి తలుపులు తెరచి చూడగా అప్పటికే రేవతి చున్నితో ఫ్యాన్​కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story