- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలికల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ.. విద్యార్థుల హాజరుపై సీరియస్!
దిశ, కొండపాక: సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ (బాలికల) వసతి గృహాన్నిఆదివారం తెలంగాణ సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ జి. రమేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. .ఈ సందర్భంగా ఆయన హాస్టల్ మొత్తాన్ని పరిశీలించారు. హాస్టల్‌లో భోజనశాల, వాష్ రూమ్ లను పరిశీలించారు. అనంతరం100 మందికి వసతి హాస్టల్‌లో కేవలం 21 మంది విద్యార్థినిలు ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. వారంలోగా 50 మందిని, అలాగే విద్యా సంవత్సరం చివరి వరకు 100 మంది అడ్మిషన్లు ఉండాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు.
అలాగే విద్యార్థినిలకు సరిపోయేలా బోజనాలను ఏర్పాటు చేయాలని.. చికెన్, కోడి గుడ్లు, అరటిపండ్లు, సాయంత్రం స్నాక్స్ నిబంధనల ప్రకారం కచ్చితంగా ఇవ్వాలని సూచించారు. హాస్టల్ ని పరిశుభ్రంగా ఉంచాలని, కరోనా తదితర విష జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థినిలను వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగారు. హాస్టల్‌లోని విద్యార్థినిలు హెల్త్ కిట్స్, బెడ్ షీట్స్ కొత్తవి అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో పి. శ్రీనివాస్ రెడ్డి , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.