ఆ విషయంలో ఇప్పటికీ విఫలమవుతున్నా.. రానా షాకింగ్ కామెంట్స్

by Hamsa |
ఆ విషయంలో ఇప్పటికీ విఫలమవుతున్నా.. రానా షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: స్టార్ నటుడు రానా దగ్గుబాటి(Rana Daggubati) హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టీస్ట్‌గా, విలన్‌గా నటించి ప్రేక్షకులను అలరించారు. గత కొద్ది కాలంగా ఆయన నిర్మాతగా మారి వైవిధ్యమైన సినిమాలతో అందరి మెప్పు పొందుతున్నారు. ఇప్పటికే కేన్స్‌లో చరిత్ర సృష్టించిన మూవీ ‘ఆల్ వి ఇమాజిన్ యూజ్ లైట్’(All We Imagine Use Light) డిస్ట్రిబ్యూషన్ హక్కులను రానా సొంతం చేసుకున్నారు. తాజాగా, ఈ సినిమా మరో ఘనత సాధించింది. ‘ఆసియా పసిఫిక్ స్క్రీన్’(Asia Pacific Screen) పురస్కారాల్లో ఐదు నామినేషన్లు దక్కించుకున్నట్లు సమాచారం. అయితే ఈ వేడుక నవంబర్ 30న జరగనున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘నేను ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు గడిచాయి. అయినప్పటికీ ప్రేక్షకులకు ఎలాంటి చిత్రాలు నచ్చుతాయో తెలుసుకోవడంలో విఫలమవుతున్నాను. పెద్ద హీరోల చిత్రాలే కాదు. కథ, భావోద్వేగాలతో నిండిన ప్రతీ సినిమా ప్రత్యేకతను చాటుకుంటుందని అర్థమైంది. 2004లో వచ్చిన ‘బొమ్మలాట’ (Bommalata)అనే యానిమేషన్ చిత్రానికి నేను నిర్మాతగా వ్యవహరించాను.

దానికి జాతీయ అవార్డు కూడా వచ్చింది. కానీ సినిమా మాత్రం థియేటర్స్‌లో విడుదల కాలేదు. దాని రిలీజ్ కోసం మేము థియేటర్స్ వెతుక్కోవాల్సి వచ్చింది. అయితే సినిమా బాగుంటే ప్రేక్షకులు కచ్చితంగా హిట్ చేస్తారన్న నమ్మకం నాకు ఉంది. అయితే ప్రపంచంలోని ఇతర భాషల్లో ఉన్నట్లుగా ఇక్కడ చిత్ర నిర్మాతలకు గ్రాంట్లు ఉండవు’’ అని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed