- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తవ్వకాల్లో బయటపడ్డ పురాతన విగ్రహం.. ఆ రాజులదే అని జోరుగా ప్రచారం!
దిశ, కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లి పెద్ద చెరువులో ఉపాధి హామీ పనులు చేస్తుండగా పురాతన వినాయకుడి విగ్రహం బయట పడింది. బుధవారం ఉదయం ఉపాధిహామీ పనులు చేపడుతుండగా చాట్ల ప్రవీణ్ బృందానికి వినాయకుని విగ్రహం లభ్యమైంది. కాకతీయుల కాలంలో రాజులు వేలుబెల్లి గుట్టకు విడిది చేసేవారని పూర్వీకులు తెలిపేవారు. మండలంలోని గుండం శివాలయం నిర్మించడానికి వేలుబెల్లి గుట్ట నుండి రాళ్లను తరలించేవారని, ఆ గుడిలో విగ్రహాల ఏర్పాటుకు వినాయకుడు, హనుమాన్, వెంకటేశ్వరస్వామి, శివలింగం వంటివి విగ్రహాలను ఇక్కడే చెక్కారని పెద్దలు అంటున్నారు.
అయితే గుండం గుడి నిర్మాణం తెల్లారేసరికి పూర్తి కావడంతో వినాయకుడు, హనుమంతుని విగ్రహాలు అక్కడే వదిలేసినట్లు గ్రామాల్లో ప్రచారం జరిగింది. అదే విగ్రహం నేడు బయటపడినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. ఆ తర్వాత కొద్దికాలం విదేశీయులు కూడా గ్రామంలో ఉండి గుప్త నిధులు తవ్వకాలు చేశారని అప్పట్లో జోరుగా ప్రచారం కూడా జరిగేది. కొత్తగూడ గంగారం మండలాల్లో కాకతీయుల కాలం నాటి ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. కొత్తగూడ మండలంలోని గుండం శివాలయం, గంగారం గంగమ్మ గుట్టపై కాకతీయ రాజుల నాటి ఆనవాళ్లు ఉన్నాయి. తవ్వాకల్లో బయట పడిన ఈ విగ్రహాన్ని చూడడానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున వచ్చి పూజలు నిర్వహించారు.