- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీపై ఐక్యంగా పోరాడుదాం.. ప్రతిపక్ష పార్టీలకు తమిళనాడు సీఎం పిలుపు
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించేందుకు కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలు కలిసి రావాలని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. వ్యక్తిగత రాజకీయాలను పక్కన పెట్టి భారత్ ను రక్షించేందుకు కలిసి రావాలని కోరారు. తమిళనాడులో తమ పార్టీతో ఉన్నటువంటి మైత్రిని దేశ స్థాయిలో ఇతర పార్టీలతోనూ పెంపొందించుకోవాలని ఆయన కాంగ్రెస్‌ను కోరారు. ఈ మేరకు జాతీయ మీడియాకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. 'భారత దేశ వైవిధ్యం, భిన్నత్వం, సమాఖ్యవాదం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమానత్వం, సౌభ్రాతృత్వం, రాష్ట్ర హక్కులు, విద్యాహక్కులు కొనసాగాలని నా మనవి. దీని కోసం ప్రతి ఒక్కరు మన వ్యక్తిగత రాజకీయ ఆలోచనలను పక్కనపెట్టి ఏకం కావాలి. అన్ని పార్టీలు ఐక్యతే బలమని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ భారత్‌ను రక్షించేందుకు రావాలి' అని తెలిపారు. రాష్ట్ర రాజకీయాలకు, దేశ రాజకీయాలకు ఎలాంటి తేడా లేదనుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర రాజకీయాల సమ్మేళనమే దేశ రాజకీయాలని చెప్పారు. తాను బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తానని, వ్యక్తులను కాదని చెప్పారు.