- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
పెళ్లైన 12 ఏళ్లకు గుడ్ న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్(పోస్ట్)
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ రాధిక ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన ఈమె.. ప్రకాష్ రాజ్ చేసిన ‘ధోని’, బాలయ్య ‘లెజెండ్’, ‘లయన్’, ‘రక్త చరిత్ర’ వంటి తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ వంటి భాషా చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. కాగా రీసెంట్గా ఈ భామ న్యూడ్, సెమీ న్యూడ్ చిత్రాల్లో కూడా నటించడం గమనార్హం.
అయితే రాధిక ఆప్డే నటించిన న్యూ మూవీ ‘సిస్టర్ మిడ్నైట్’. కరణ్ కంధారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 19న డైరెక్టర్స్ ఫోర్ట్‌నైట్ కేన్స్‌లో ప్రదర్శించబడింది. 2024 కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఈ చిత్రం రెండు విభాగాల్లో నామినేషన్ దక్కించుకుంది. ఇక ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం ప్రీమియర్ షో లండన్‌లో జరుగుతుండగా ఈమె కూడా పాల్గొంది. అక్కడ ఈ భామకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..
రాధిక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే 2012లో బ్రిటీష్ వయొలినిస్ట్ బెండిక్ట్ టేలర్‌తో ఏడడుగులు వేసింది. అయితే పెళ్లైన 12 ఏళ్ల తర్వాత ఈ భామ అమ్మ కాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ బ్యూటీ బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. అయితే, తల్లి కాబోతున్న విషయాన్ని ఇప్పటివరకు ఆమె గోప్యంగానే ఉంచడం గమనార్హం. కాగా నవంబర్ నెలలో పండంటి బిడ్డకు రాధిక జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక సుమారు 12 ఏళ్ల తర్వాత ఆమె తల్లి కానుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
(video link credits to radhika instagram id)