- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Paytm: కొత్త యూపీఐ కస్టమర్లను చేర్చుకునేందుకు పేటీఎంకు ఎన్‌పీసీఐ అనుమతి

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎంపై ఈ ఏడాది ప్రారంభంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో తాజాగా పేటీఎం బ్రాండ్ మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌కు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) కొత్త కస్టమర్లను చేర్చుకునేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అనుమతులు ఎన్‌పీసీఐ విధానపరమైన మార్గదర్శకాలు, పేమెంట్ సర్వీస్ ప్రొవడర్ బ్యాంకులతో ఒప్పందాలకు లోబడి ఉంటాయి. ఈ మేరకు పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మకు ఎన్‌పీసీఐ చీఫ్ దిలీప్ అస్బె లేఖ రాశారు. ఈ పరిణామంతో పేటీఎం యూపీఐ లావాదేవీలు పెరిగేందుకు అవకాశం ఉంది. ఆర్‌బీఐ ఆంక్షల కారణంగా పేటీఎం యూపీఐ విభాగంలో మార్కెట్ వాటాను 13 శాతం నుంచి 7 శాతానికి కోల్పోయింది. అయినప్పటికీ పేటీఎం యూపీఐ వ్యాపారంలో మూడో అతిపెద్ద ప్లాట్‌ఫామ్‌గా కొనసాగించగలిగింది.