రన్నింగ్‌లో ఊడిపోయిన బస్సు చక్రాలు..

by Aamani |
రన్నింగ్‌లో ఊడిపోయిన బస్సు చక్రాలు..
X

దిశ,తూప్రాన్ : మెదక్ జిల్లా తూప్రాన్ 44వ జాతీయ రహదారి నాగులపల్లి వద్ద తప్పిన పెను ప్రమాదం తప్పింది. రాజస్థాన్ నుండి 35 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున వేగంగా వెళుతున్న బస్సు వెనుక చక్రాలు రెండు వైపులా ఊడిపోయి బస్సు అదుపుతప్పి పోయింది.ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలు కాగా డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్ ను డివైడర్ వైపు తిప్పడం తో ఢీకొని ఆగిపోయింది దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 35 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.విషయం తెలుసుకున్న జాతీయ రహదారి సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ తొలగింపు చర్యలు చేపట్టారు.



Next Story

Most Viewed