- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kolkata: 59 మంది ఆర్‌జి కర్ ఆసుపత్రి జూనియర్ డాక్టర్ల సస్పెన్షన్‌పై కలకత్తా హైకోర్టు స్టే
దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు చెందిన 59 మంది జూనియర్ డాక్టర్ల సస్పెన్షన్‌పై కలకత్తా హైకోర్టు మంగళవారం స్టే విధించింది. వారిలో ఆరుగురు మెడికోలను బహిష్కరించారు. సస్పెన్షన్, బహిష్కరణ ఉత్తర్వులు పూర్తిగా సహజ న్యాయాన్ని ఉల్లంఘించాయని మెడికోల తరపు న్యాయవాదుల వాదించడంతో కోర్టు స్టే ఆర్డర్‌ను జారీ చేసింది. ఈ మేరకు సస్పెండ్ అయిన జూనియర్ డాక్టర్ల తరపున న్యాయవాది అర్కప్రవ సేన్ అన్నారు. జస్టిస్ కౌసిక్ చందా సింగిల్ బెంచ్ స్టేకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. నవంబర్ 11న తదుపరి కేసును కోర్టు విచారించనుంది. అలాగే, ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని కోర్టు స్పష్టం చేసింది. అంతకుముందు రోజు సస్పెన్షన్ ఉత్తర్వులపై ఆరోగ్య శాఖ ఇన్‌ఛార్జ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నలు లేవనెత్తిన ఒక రోజు తర్వాత విచారణ జరిగింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించి వద్ద నిరసన సాగిస్తున్నారు. దీనిపై ఆగష్టులో కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ చర్యలు తీసుకుంది.