- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Guntur AIMS Jobs: గుంటూరు ఎయిమ్స్ లో వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్.. ఖాళీలు, అర్హత వివరాలివే..!
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు(Guntur) జిల్లా మంగళగిరి(Mangalagiri)లోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్(AIMS) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 93 గ్రూప్ -ఏబీసీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.aiimsmangalagiri.edu.in ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్ -ఏ పోస్టులకు ఆఫ్ లైన్, గ్రూప్ -బీ, సీ పోస్టులకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ 29 అక్టోబర్ 2024
పోస్టుల వివరాలు:
- గ్రూప్ -ఏ పోస్టులు- మెడికల్ ఆఫీసర్, మెడికల్ ఫిజిసిస్ట్, సైకాలజిస్ట్
- గ్రూప్ -బీ పోస్టులు- స్టోర్ కీపర్, జూనియర్ ఇంజినీర్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ లాంటి తదితర పోస్టులు ఉన్నాయి.
- గ్రూప్ -సీ పోస్టులు- న్యూక్లియర్ మెడికల్ టెక్నాలజిస్ట్, హాస్పిటల్ అటెండెంట్, స్టెనోగ్రాఫర్ వివిధ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత:
పోస్టును బట్టి బీఎస్సీ, ఇంటర్మీడియట్, మెట్రిక్యూలేషన్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు పోస్టును బట్టి తేడాలు ఉంటాయి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
గ్రూప్ -ఏ పోస్టులకు ఇంటర్వ్యూ ద్వారా, గ్రూప్ -బీ, సీ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు :
అన్ రిజర్వ్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 1500 ఎస్సీ/ఎస్టీ లకు రూ. 1000. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు:
దేశవ్యాప్తంగా 15 కేంద్రలలో సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఎగ్సామ్ సెంటర్స్ ఉన్నాయి.