- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jai Hanuman: ‘జై హనుమాన్’లో హనుమంతుడిగా ఆ స్టార్ హీరో.. మరింత పెరుగుతోన్న హైప్
దిశ, సినిమా: యంగ్ హీరో తేజా సజ్జా (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashant Verma) కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఎన్నో అంచనాల మధ్య ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ మూవీ.. ఇండియన్ బాక్సాఫీస్ (box office) వద్ద సంచలనం సృష్టించింది. గ్లోబల్ వైజ్‌గా రూ. 350 కోట్లు వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ (blockbuster) హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సీక్వెల్ ‘జై హనుమాన్’ (Jai Hanuman) అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
‘జై హనుమాన్’ (Jai Hanuman) అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఉత్సాహం మరింత రెట్టింపు పెరిగింది. అంతే కాకుండా ఈ మూవీలో అగ్ర నటులు సైతం నటిస్తున్నారనే వార్తలు ఈ మూవీపై మరింత హైప్ పెంచేస్తున్నాయి. ఇప్పుడు మరోకొత్త న్యూస్ ట్రెండ్ అవుతోంది. ‘జై హనుమాన్’ (Jai Hanuman) చిత్రంలో మెయిన్‌గా హనుమంతుడు (Hanuman) ఉంటాడు కాబట్టి.. ఈ క్యారెక్టర్‌కు చిరంజీవి, రామ్ చరణ్, రానా దగ్గబాటిలలో ఎవరైనా ఒకరు చేస్తారు అన్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే.. ఇప్పుడు తాజా సమాచారం మేరకు ‘జై హనుమాన్’ (Jai Hanuman)లో హనుమంతుడు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అతడు మరెవరో కాదు.. ‘కాంతార’ (Kantara) చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ (blockbuster) అందుకున్న కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishabh Shetty). ఇప్పటికే ‘జై హనుమాన్’ (Jai Hanuman) చిత్ర బృందం రిషబ్ శెట్టి (Rishabh Shetty)ని కలవగా.. దేవుడు అంటే అమితమైన భక్తి ఉండే రిషబ్ (Rishabh) దీనికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (Official Announcement) వచ్చేవరకు వేచి చూడాల్సి ఉంది.