- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Amit Shah: ప్రభుత్వ విధానాలతో కశ్మీర్‌లో వేర్పాటువాదం నిర్మూలన.. కేంద్ర మంత్రి అమిత్ షా

దిశ, నేషనల్ బ్యూరో: మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) లో వేర్పాటువాదం పూర్తిగా అంతమైందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) తెలిపారు. దీనిని పూర్తిగా నిర్మూలించేందుకు మరింత కృషి చేస్తామని పేర్కొన్నారు. హురియత్‌లోని రెండు ప్రధాన సంస్థలు జమ్మూ అండ్ కశ్మీర్ పీపుల్స్ మూవ్‌మెంట్, డెమోక్రటిక్ పొలిటికల్ మూవ్‌మెంట్ సంస్థలు వేర్పాటువాదంతో అన్ని సంబంధాలను తెంచుకుంటున్నట్టు ప్రకటించాయని వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. భారతదేశ ఐక్యతను బలోపేతం చేయడానికి ఇది ఎంతో కీలకమైందని అభివర్ణించారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి జరుగుతోందని, అందుకే వేర్పాటువాద కార్యకలాపాలు తగ్గాయన్నారు. మోడీ ప్రభుత్వం చర్యలతో ఉగ్రవాదం సైతం అంతమయ్యే స్థితిలో ఉందని నొక్కి చెప్పారు.
కాగా, జమ్మూ కశ్మీర్‌లో చాలా కాలంగా హురియత్‌లోని రెండు వర్గాలు జమ్మూ అండ్ కశ్మీర్ పీపుల్స్ మూవ్‌మెంట్, డెమోక్రటిక్ పొలిటికల్ మూవ్‌మెంట్ సంస్థలు వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి. అయితే అవి తాజాగా వేర్పాటు వాదాన్ని విడిచిపెడుతున్నట్టు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే అమిత్ షా పై వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ గ్రూపులు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉగ్రవాదులకు కూడా సహాయం చేస్తున్నాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇటీవలే వేర్పాటు వాదానికి పాల్పడుతున్నాయనే ఆరోపణలతో మీర్వయిజ్ ఉమర్ ఫరూక్ నేతృత్వంలోని అవామీ యాక్షన్ కమిటీ, జమ్మూ కశ్మీర్ ఇత్తెహదూల్ ముస్లిమీన్ సంస్థలను ఐదేళ్ల పాటు నిషేదిస్తూ హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలోనే రెండు సంస్థలు వేర్పాటు వాదాన్ని విడిచిపెడుతున్నట్టు ప్రకటించడం గమనార్హం.