Test Movie: టెస్ట్ మ్యాచ్ కారణంగా ముగ్గురు జీవితాల్ని మలుపుతిప్పిన అదిరిపోయే ట్రైలర్

by Anjali |
Test Movie: టెస్ట్ మ్యాచ్ కారణంగా ముగ్గురు జీవితాల్ని మలుపుతిప్పిన అదిరిపోయే ట్రైలర్
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్, టాలీవుడ్, మలయాళ సినీ ఇండస్ట్రీల్లో లేడీ సూపర్ స్టార్ నయనతార (Lady Superstar Nayanthara) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తెలుగులో అనేక చిత్రాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. జవాన్ (Jawan) సినిమాతో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది.

ఇకపోతే ప్రస్తుతం నయనతార క్రికెట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తుంది. టెస్ట్ అనే ఈ మూవీకి శశి కాంత్ (Shashi Kanth) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని చక్రవర్తి రామచంద్ర (chakravarthi Ramachandra) నిర్మంచగా.. కాళీ వెంకట్, మీరా జాస్మిన్(Mira Jasmine), నాజర్ (Nazar) వంటి పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే ఏప్రిల్ 4 వతేదీన ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ అవ్వనుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. చైన్నైలో జరిగిన ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురు జీవితాల్ని ఎలా ప్రభావితం చేసిందనే నేపథ్యంలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు దర్శకుడు శశి కాంత్.

మలయాళం, కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనున్న ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఇందులో నయనతార, మీరా జాస్మిన్, సిద్ధార్థ్ యాక్టింగ్ జనాల్ని ఆకట్టుకుంటోంది. ట్రైలర్ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక మన దేశంలో ప్రజలు క్రికెట్ ఎక్కువగా ఇష్టపడుతారన్న విషయం తెలిసిందే. క్రికెట్ నేపథ్యంలో వచ్చే చిత్రాలకు జనాలు విపరీతంగా అట్రాక్ట్ అయిపోతారు.

Next Story

Most Viewed