- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
శ్రీనిధి రుణాల బకాయిలు వసూలు చేయాలి
by Sridhar Babu |

X
దిశ ప్రతినిధి నిర్మల్ : శ్రీనిధి రుణ బకాయిల వసూలును త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శ్రీనిధి రుణాలపై ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గడువులోగా శ్రీనిధి రుణాల వసూలు ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. మండలాల వారీగా మహిళా సంఘాల సంఖ్య, మంజూరు చేసిన రుణాలు, ఇప్పటివరకు సంఘాలు చెల్లించిన బకాయిలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ చార్జి డీఆర్డీఓ శ్రీనివాస్, మెప్మా పీడీ సుభాష్, శ్రీనిధి ప్రాంతీయ సమన్వయకర్త సరిత, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Next Story