- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మంచినీటి సమస్య పరిష్కారానికి కాగ్నా నదే ప్రత్యామ్నాయం

దిశ, తాండూరు : తాండూరు మున్సిపాలిటీ తో పాటు మంచినీటి సరఫరా, చిలక వాగు ప్రక్షాళన వంటి కీలక అంశాలపై అసెంబ్లీ సమావేశంలో తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గుర్తు చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ద్వారా తాండూరు సమస్యలపై మరోసారి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించడం తో రాష్ట్ర మంత్రులను తాండూరు వైపు మళ్లించినట్లు చేశాడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి . అంతేకాకుండా తాండూరు మున్సిపల్ పరిధిలో స్థానికులతో పాటు వలసదారులతో లక్షకు పైగా జనాభా నివసిస్తున్నారని అందరికీ కూడా మంచినీటి సదుపాయం కల్పించేందుకు తాండూరు పట్టణ శివారులోని కాగ్నా నదిలో నూతన పంప్ హౌస్ లో కొత్త మోటర్లను అమర్చడం తోపాటు తాండూర్ పట్టణం వరకు నూతన పైపులైను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుతం తాండూరు ప్రాంతానికి సరఫరా అవుతున్న మిషన్ భగీరథ తాగునీరు సరిపడినంతగా రావడం లేదని చెప్పారు. ఇతర జిల్లాల నుంచి వస్తున్న మిషన్ భగీరథ సరఫరా ఏ క్షణమైన ఆగితే పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు.
అయితే గతంలో కాగ్నానది లోని పంపుహౌస్ ల ద్వారా తాగునీరు సరఫరా జరిగేదని 50 ఏండ్ల క్రితం ఏర్పాటు చేసిన పంపు హౌస్ లో మరమ్మతులకు గురైన మోటార్లను రిపేర్ చేయాల్సి వస్తే ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన అవసరం వస్తుందన్నారు. నూతన పైపులైన్లు, మోటర్లు అమర్చితే తాండూరు పట్టణ వాసులకు శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. పురాతన మోటార్ల మరమ్మత్తులకు సామాగ్రి కావాలంటే బోపాల్, హర్యానా వంటి రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కావున ప్రభుత్వం తక్షణమే తాండూరు ప్రాంతంలో తాగునీటి సమస్య లేకుండా చూసేందుకు నూతన పంపుహౌస్ కొత్త పైపులైన్ , మోటార్లు మంజూరు చేసేందుకు సంబంధిత మంత్రి ద్వారా నిధులు విడుదల చేయాల్సిందిగా కోరారు. అదేవిధంగా చిలుక వాగు పూర్తిగా ఆక్రమించుకోవడంతో వర్షాకాలంలో నీటి ముంపుకు గురవుతున్న అనేక ప్రాంతాల ప్రజలకు పరిష్కార మార్గాన్ని చూపేందుకు చిలుక వాగు ప్రక్షాళన ఎంతో అవసరమన్నారు. దీంతో తాండూరు ప్రజలు ఎమ్మెల్యే పై హర్షం వ్యక్తం చేశారు.