Yogi Adityanath: ఆయన ఓ నమూనా.. రాహుల్ గాంధీపై యోగి విమర్శలు

by Shamantha N |
Yogi Adityanath: ఆయన ఓ నమూనా.. రాహుల్ గాంధీపై యోగి విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) విమర్శలు గుప్పించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన రాహుల్ గురించి మాట్లాడారు. ఆయన్ని నమూనా ని విమర్శించారు. రాహుల్ వల్ల బీజేపీకి మేలు చేకూరుతోందని చెప్పుకొచ్చారు. విదేశాల్లో రాహుల్ భారత్ గురించి చేసిన వ్యాఖ్యల ఉద్దేశం ప్రజలకు అర్థమయ్యిందని అన్నారు. విభజన రాజకీయాల్లో భాగంగానే రాహుల్ జోడో యాత్ర చేపట్టారని చెప్పుకొచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసం సున్నితమైన అంశాలను కాంగ్రెస్ పొడిగించిందని విమర్శించారు. ట్రిపుల్ తలాక్‌ను కాంగ్రెస్ ఎందుకు రద్దు చేయలేదని అడిగారు. కుంభమేళాను ఎందుకు ప్రచారం చేయలేదని.. దేశానికి ఉన్నతస్థాయి మౌలిక సదుపాయాలను ఎందుకు కల్పించలేదు అని ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాకుండా, కాంగ్రెస్ తప్పుడు సమాచారాన్ని వ్యప్తి చేసిందన్నారు. గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో విదేశీ జోక్యం గురించి కూడా మాట్లాడారు. ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కాంగ్రెస్ జార్జి సోరస్‌ డబ్బును ఉపయోగించింది. విదేశీ డబ్బును వాడటం దేశ ద్రోహం కిందికి రాదా..?’’ అని ప్రశ్నించారు.

మైనారిటీలు సురక్షితమే

ఉత్తరప్రదేశ్ లోని మైనారిటీ కుటుంబాలు (Muslim families) అత్యంత సురక్షితంగా ఉన్నారని యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) అన్నారు. హిందువులు (Hindu families) సురక్షితంగా ఉంటే.. ముస్లింలు కూడా సురక్షితంగా ఉంటారని చెప్పారు. ‘2017కి ముందు యూపీలో అల్లర్లు జరిగితే హిందూ దుకాణాలు కాలిపోతుండేవి. అప్పుడు ముస్లిం షాపులను కూడా తగలబెట్టేవారు. హిందువుల ఇళ్లు కాలిపోతే.. ముస్లింల ఇళ్లు కూడా కాలిపోయేవి. కానీ, 2017 తర్వాత అంతా మారిపోయింది. ఒక యోగిగా నేను అందరి ఆనందం కోరుకుంటాను. బీజేపీ అధికారం చేపట్టాక రాష్ట్రంలో మతపరమైన అల్లర్లు ఆగిపోయాయి. 100 హిందూ ఇళ్లు ఉన్న ఏరియాలో ఒక ముస్లిం కుటుంబం సురక్షితంగా ఉంటోంది. 100 ముస్లిం కుటుంబాలు ఉన్న ప్రాంతంలో ఒక్క హిందూ కుటుంబం, లేదా 50 హిందూ కుటుంబాలు సురక్షితంగా ఉంటాయా..? లేదు కదా. ఇందుకు బంగ్లాదేశే ఓ ఉదాహరణ. పాకిస్థాన్‌ మరో ఉదాహరణ’ అని సీఎం యోగి చెప్పుకొచ్చారు. కాగా.. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మెజారిటీని కోల్పోయింది. మిత్రపక్షాలతో ప్రభుత్వాన్ని ఏఱ్పాటుచేసింది. మరీ ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో కమలానికి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ ఇండియా బ్లాక్ 43 స్థానాలు దక్కించుకుంది.

Next Story