- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అట్టహాసంగా శ్రీరామనవమి సంబరాలు.. భారీగా హాజరైన భక్తులు
దిశ, భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలోని మిథిలా ప్రాంగణంలో ఆదివారం శ్రీ రాములోరి కళ్యాణం అట్టహాసంగా జరిగింది. తొలుత రామాలయంలోని అంతరాలయంలో ధ్రువ మూర్తుల కళ్యాణం జరిపారు. అనంతరం మంగళవాయిద్యాలతో ఊరేగించారు. శుభ ముహూర్తం అభిజిత్ లగ్నం సమీపించగా శ్రీరామునికి సీతమ్మకు వివాహం చేశారు. అనంతరం స్వామి వారికి చేయించిన బంగారు ఆభరణాలను అలంకరించారు. ఈ మహోత్వవానికి పలువురు మంత్రులు విచ్చేశారు. వారంతా ప్రభుత్వం తరపున కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. మరెందరో ప్రముఖులు భద్రాచలంలో జరిగిన శ్రీరామ నవమి మహోత్వవానికి హాజరై రాములవారి కళ్యాణాన్ని తిలకించారు.
ఈ ఏడాది స్వామి వారి కళ్యాణం చూసేందుకు సుమారు 2.5 లక్షల మంది తరలివచ్చారని అధికారులు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం తాగు నీటితో పాటు మజ్జిగ ఏర్పాటు చేశారు. భక్తజనులకు తలంబ్రాలు, లడ్డూ ప్రసాదాలు అందుబాటులో ఉంచారు. భారీ పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా నీడలో సీతారాముల కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది. భక్తుల తిరుగు ప్రయాణంలో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది.