శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స రాజీనామా..?

by Vinod kumar |
శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స రాజీనామా..?
X

కొలంబో: లంక సంక్షోభం నేపథ్యంలో దేశ ప్రధాన మంత్రి మహీంద రాజపక్సా రాజీనామా చేశారని అంతర్జాతీయ మీడియా పేర్కొన్నాయి. తన రాజీనామా లేఖను అధ్యక్షుడు గొటబొయే రాజపక్సేకు పంపారని పేర్కొన్నాయి. అయితే ఈ వార్తలపై శ్రీలంక ప్రభుత్వం నిరాకరించింది. ప్రధాన మంత్రి రాజీనామా చేసినట్లు వస్తున్న వార్తలు నిరాధారమని సమాచార శాఖ డైరెక్టర్ జనరల్ మోహన్ సమరనాయకే తెలిపారు. అంతేకాకుండా మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుపై మాత్రం స్పందించేందుకు ఆయన నిరాకరించారు. ఇప్పటికే ప్రతిపక్షాలు అన్ని కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed