- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్‌కు అస్వస్థత.. ప్రత్యేక పూజలు నిర్వహించిన టీఆర్ఎస్ నాయకులు..
దిశ, కంది: సీఎం కేసీఆర్ శుక్రవారం స్వల్ప అస్వస్థత కారణంగా హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, కేసీఆర్ అనారోగ్యానికి గురికావడంతో ఆయన అభిమానులు.. కేసీఆర్ నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండి ప్రజాసేవలో ముందుకు సాగాలని కోరుతూ శనివారం సంగారెడ్డి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చక్రపాణి ఆధ్వర్యంలో కల్పగూర్ శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు పయనించేలా కృషి చేస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. అలాంటి నాయకుడు ప్రజా సేవలో అంకితమై నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మంజుల పండరినాథ్, ఉపసర్పంచ్ అజయ్, డ్వాక్రా సంఘము మహిళలు పాల్గొన్నారు.