- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటర్నేషనల్ ట్రాన్స్‌జెండర్ డే ఆఫ్ విజిబిలిటీ.. ఎలా వచ్చిందంటే?
దిశ, ఫీచర్స్: సంవత్సరంలోని ప్రతి రోజుకూ చరిత్రలో ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. కొన్ని అద్భుతాల పుట్టుక సందర్భంగా గుర్తంటే మరికొన్ని మాత్రం కొందరికి గుర్తింపుగా నిలుస్తాయి. అదే విధంగా మార్చి 31 కి కూడా చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. చరిత్రలో ఈ రోజును 'ఇంటర్నేషనల్ ట్రాన్స్‌జెండర్ డే ఆఫ్ విజిబిలిటీ(TDOV)గా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా లింగమార్పిడి వ్యక్తులు ఎదుర్కొంటున్న వివక్షపై అవగాహన కల్పించేందుకు, సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ ప్రత్యేక రోజు అంకితం చేయబడింది. మిచిగాన్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్ రాచెల్ క్రాండాల్.. గుర్తింపునకు నోచుకోని ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీకి మద్దతుగా ఈ రోజును స్థాపించారు. సమాజం లింగమార్పిడి వ్యక్తులు చనిపోతే సంతాపం తెలుపుతుందే కానీ బతికున్నప్పుడు గుర్తించడం లేదనే ఆవేదన నుంచి ఈ ఆలోచన పుట్టుకొచ్చింది. కాగా 2009 మార్చి 31న మొదటిసారి జరిగిన ఈవెంట్‌కు U.S బేస్డ్ యూత్ అడ్వకసీ ఆర్గనైజేషన్ ట్రాన్స్ స్టూడెంట్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ నాయకత్వం వహించింది.