- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒక్కరోజే 4 లక్షల కేసులు.. దక్షిణ కొరియా పై కరోనా పంజా
సియోల్: దక్షిణ కొరియాలో భారీ సంఖ్యలో కరోనా కేసులు వెలుగు చూశాయి. బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 4,00,741 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కరోనా మహమ్మారి దేశంలో ప్రవేశించిన తర్వాత అత్యధికం ఇదేనని తెలిపారు. దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు అని సీనియర్ ఆరోగ్య అధికారి సోహ్న్ యంగ్-రే విలేకరుల సమావేశంలో చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో కేసులు భారీగా పెరిగినట్లు తెలిపారు. ఈ విపత్తును అధిగమిస్తే సాధారణ పరిస్థితులకు దగ్గరమవుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం గత ఏడు రోజుల్లో 23,58,878 కేసులతో దక్షిణ కొరియా మొదటి స్థానంలో ఉంది. దాని తర్వాత స్థానంలో వియత్నాం 17,95,380 కేసులతో రెండో స్థానంలో ఉంది. ఇప్పటికే అర్హులైన వారిలో చాలా మందికి టీకాలతో బూస్టర్ డోసులు అందజేశారు. అయితే మరణాల సంఖ్య తక్కువగా ఉండటం కాస్త ఉపశమనం కలిగిస్తుంది. కాగా, కేసులను నియంత్రించేందుకు దేశంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించగా, ఆరుగురు మించి ఎక్కువగా గుమిగూడకుండా ఆదేశాలు జారీ చేశారు.