అలా చేసే వాళ్లంతా మూర్ఖులే.. పెళ్లి ఇష్యూపై స్పందించిన సోనాక్షి

by Javid Pasha |   ( Updated:2022-03-05 07:56:23.0  )
అలా చేసే వాళ్లంతా మూర్ఖులే.. పెళ్లి ఇష్యూపై స్పందించిన సోనాక్షి
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా వివాహం చేసుకున్నారంటూ గత వారం రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్న ఫొటోలు కూడా నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ ఇష్యూపై తాజాగా స్పందించిన సోనాక్షి.. ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసేవాళ్లను దుర్మార్గులుగా పోల్చింది.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సల్మాన్‌ తనకు ఉంగరం తొడుగుతున్న ఫొటోను షేర్ చేసిన నటి.. 'నిజమైన చిత్రానికి, మార్ఫింగ్ చేసిన చిత్రానికి మధ్య తేడాను గుర్తించలేనంత మూర్ఖులా?' అంటూ నెటిజన్లపై ఫైర్ అయింది. అలాగే నిజ జీవితంలో పెళ్లి అనేది ఒకేసారి జరుగుతుందన్న ఆమె.. సోషల్ మీడియాలో మాత్రం ఎన్నిసార్లు జరుగుతుందో తమకే తెలియదంటూ ఫన్నీ కామెంట్స్ చేయడం విశేషం.


Advertisement

Next Story