- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్‌పై సింకారు శివాజీ ఫైర్.. ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరిక..
దిశ, అచ్చంపేట: 1,91,000వేల ఉద్యోగాలకు.. ఒక్క ఉద్యోగం తక్కువ వేసిన, కేసీఆర్‌ను మాజీ ముఖ్యమంత్రిని చేస్తామని యువసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ హెచ్చిరించారు. సీఎం కేసీఆర్ వనపర్తి సభపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. సీఎం ముందు చెప్పిన ఉద్యోగాల కంటే.. ఒక్క ఉద్యోగం తక్కువ అయిన ఊరుకునే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. 58 ఏళ్లు ఉన్న ఉద్యోగ వయో పరిమితిని 61సంవత్సరాలకు చేసినందుకు నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 61 ఏళ్లుగా ఉన్న ఉద్యోగ వయో పరిమితి వెంటనే రద్దు చేసి.. పాత పద్దతినే కొనసాగించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్క నిరుద్యోగి ఖాతాలో నిరుద్యోగ భృతి డబ్బులు జమ చేయాలన్నారు. ప్రశాంత్ కిషోర్ కేసీఆర్‌కు ఏమి చెప్పాడో తెలియదు కాని.. ఇన్నాళ్ళకు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా సీఎం కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సారి నిరుద్యోగులను మోసం చేస్తే ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.