ఇంటి పునాదిలో వెండి నాణేల కలకలం!

by Vinod kumar |
ఇంటి పునాదిలో వెండి నాణేల కలకలం!
X

దిశ, మక్తల్: నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రంలో ఘాళ ఉమామహేష్ పురాతన ఇల్లు కూలిపోయింది. మంగళవారం ఆ మట్టిని తొలగిస్తుండగా వెండి నాణ్యాలు దొరికాయి. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ పోలీస్ సిబ్బంది ఐదు నాణెములు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. మక్తల్ నియోజకవర్గంలోని ఊట్కూర్ మండల కేంద్రంలో 1835లో నిర్మించిన విశాలమైన భవనం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిపోయింది.


ఆ ఇంటిని పునర్నిర్మించేందుకు సోమవారం నుండి జేసీపీతో మట్టిని తొలగించి చేరుకట్ట వైపు ఉన్న వైకుంఠదామంలో డంఫ్ చేయగా అటు వైపు కొందరు యువకులు బహిర్భూమికి వెళ్లినప్పుడు వారికి వెండి నాణేలు దోరకడం.. ఇది కాస్త వైరల్ కావడంతో అక్కడికి జనం చేరి మట్టిలో వెండి నాణేల కోసం వెతకడం మొదలు పెట్టారు.


ఈ విషయం పోలీసులకు తెలియడంతో అక్కడికి చేరుకుని జనాన్ని చెదరగొట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఇంటి యజమాని నుండి ఐదు వెండి నాణేలను స్వాధీనం చేసుకున్నట్టు ఆర్ఐ మల్లేశ్, ఏఎస్ఐ సురేందర్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇది ఇలా ఉండగా ఉదయం నుండి కొందరు మట్టిలో వెతగ్గా దాదాపు వందకు పైన దొరికి ఉండొచ్చని, అవి దొరికిన వాళ్ళు నారాయణ పేటకు వెళ్ళి పరీక్షించుకొని అక్కడే అమ్ముకున్నట్లు ప్రజలు అనుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed