నిందితునిపై చేయి చేసుకున్న ఎస్సై.. ఆగ్రహిస్తున్న తండా వాసులు

by Mahesh |   ( Updated:2024-07-02 15:15:39.0  )
నిందితునిపై చేయి చేసుకున్న ఎస్సై.. ఆగ్రహిస్తున్న తండా వాసులు
X

దిశ, చిలుకూరు: ఓ వ్యక్తిపై స్టేషన్ ఆవరణలోనే ఎస్సై చేయి చేసుకున్న వైనమిది.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జానకి నగర్ కు చెందిన ఉపేందర్.. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందని ఇన్‌స్టాగ్రాంలో ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో స్థానిక టీఆర్ఎస్ కార్యకర్త ఒకరు ఎస్సై శ్రీనివాస్ యాదవ్ కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై.. ఉపేందర్ ను స్టేషన్‌కు విచారణ నిమిత్తం పిలిపించారు. ఉపేందర్ తప్పేమీ చేయలేదని చెప్పేందుకు స్థానికుడైన అమ్రు నాయక్ స్టేషన్ కు వెళ్లాడు. ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయాల్సిన ఎస్సై అకారణంగా అతనిపై చేయి చేసుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ట్రోల్ కావడంతో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఎస్సై తీరుకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఎస్సై మాట్లాడుతూ అమ్రు నాయక్ అమర్యాదగా మాట్లాడాడని అన్నారు.

Click Here For Video Post..

Advertisement

Next Story