వెబ్ సిరీస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో.. నయా లుక్ అదుర్స్

by Nagaya |
వెబ్ సిరీస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో.. నయా లుక్ అదుర్స్
X

దిశ, సినిమా : అక్కినేని కాంపౌండ్‌కు చెందిన యంగ్ హీరో సుశాంత్ వెబ్ సిరీస్‌ల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు.ఈ క్రమంలో సుశాంత్ బర్త్‌డే సందర్భంగా 'జీ5' ఫ్యామిలీ.. తనకు గ్రాండ్ వెల్‌కమ్ చెబుతూ స్పెషల్ పిక్ విడుదల చేసింది. ఇందులో పోలీస్ వాహనం ముందు స్టైలిష్ లుక్‌లో నిలబడ్డ సుశాంత్.. ఏదో తమాషా జరుగుతుంటే చూస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి ఈ సిరీస్‌లో తను పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక ఈ వెబ్ సిరీస్‌ను కొల్లా ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ప్రవీణ్ కొల్లా నిర్మిస్తుండగా లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తామని 'జీ5' ఫ్యామిలీ తెలిపింది.

Advertisement

Next Story