అడివి శేష్‌కు బిగ్ షాకిచ్చిన శృతి హాసన్.. హాట్ టాపిక్‌గా మారిన వ్యవహారం!

by Hamsa |   ( Updated:2024-10-16 15:36:29.0  )
అడివి శేష్‌కు బిగ్ షాకిచ్చిన శృతి హాసన్.. హాట్ టాపిక్‌గా మారిన వ్యవహారం!
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు అడివి శేష్ (Adivi Sesh)మొదట పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత హీరోగా మారి వైవిధ్యమైన పాత్రలతో తన పాపులారిటీ పెంచుకుంటున్నారు. ఆయన నటించిన ‘హిట్’ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. దీంతో అడివి శేష్(Adivi Sesh) నుంచి మూవీ వస్తుందంటే చాలు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రజెంట్ అడివి శేష్(Adivi Sesh) నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్’. ఇందులో శృతి హాసన్(Shruti Haasan) ప్రధాన పాత్రలో నటిస్తోంది.

ఇప్పటికే ఇందులోంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా 70 శాతం పూర్తి అయింది. ఈ క్రమంలో.. ‘డెకాయిట్’ మూవీ నుంచి శృతి హాసన్ (Shruti Haasan)తప్పుకున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. డేట్స్ ఇష్యూతో పాటు అడివి శేష్‌ కూడా కారణం అని తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శృతి ప్లేస్‌లోకి ఎవరు వస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు అడివి శేష్‌కు బిగ్ షాకిచ్చిందని చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story