- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆక్సిజన్ పెట్టుకొని షూటింగ్.. సమంత మెడికల్ కండిషన్ చూసి భయపడిపోయినా.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడి సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. అలా దూరమైన ఈ భామ దాదాపు ఏడాది తర్వాత ‘సిటాడెల్: హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్‌తో మనముందుకు వచ్చింది. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సిరీస్ నవంబర్ 7నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ సిరీస్ అద్భుతమైన రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఇందులో సమంత యాక్టింగ్‌కు ఫుల్ మార్కులే పడ్డాయి. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా ఈ సిరీస్ ప్రొమోషన్స్‌లో భాగంగా హీరో వరుణ్ ధావన్ సమంత గురించి చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆయన మాట్లాడుతూ ‘నేను సిటాడెల్ షూటింగ్ చేస్తున్న సమయంలో సమంత పడిన కష్టాలను కళ్లారా చూశాను. షాట్స్‌కి గ్యాప్ దొరికినప్పుడల్లా ఆమె ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకునేది. అనేక సందర్భాలలో ఆమె షూటింగ్ చేస్తున్నప్పుడు స్పృహ తప్పి కింద పడిపోయేది. అయినా కానీ ఇచ్చిన కమిట్మెంట్‌కి కట్టుబడి షూటింగ్‌ని పూర్తి చేసింది. ఇలాంటి అద్భుతమైన మనిషిని నేను నా జీవితంలో చూడలేదు. కేవలం ఆడవాళ్ళకు మాత్రమే కాదు, సమంత ఈ జనరేషన్ జనాలందరికీ గొప్ప స్ఫూర్తి. ఆమె నుండి నేను చాలా నేర్చుకున్నాను, ఆమెతో పని చేస్తూ ఆమె ఫ్యాన్ అయిపోయా’ అంటూ వరుణ్ ధావన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు ఆమె ఫ్యాన్స్ అయ్యో పాపం సమంత అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.