షాకింగ్ ట్విస్ట్.. భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న శివ బాలాజీ?

by Hamsa |   ( Updated:2024-10-17 14:57:51.0  )
షాకింగ్ ట్విస్ట్..  భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న శివ బాలాజీ?
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు పలు సినిమాల్లో నటించి తమ సహాయక నటీనటులతో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం కామన్. మరీ ముఖ్యంగా హీరో, హీరోయిన్స్ కూడా ప్రేమించుకుని నచ్చకుంటే బ్రేకప్ చెప్పుకుంటున్నారు. లేదా పెళ్లైన కొద్ది కాలం తర్వాత విడాకులు తీసుకుని విడిపోతున్నారు. అయితే ఇదే కోవలోకి నటుడు శివ బాలాజీ(Shiva Balaji) కూడా వస్తారు. ఆయన మొదటి సినిమాలో నటించిన మధుమిత(Madhumita)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే ఇటీవల శివబాలాజీ(Shiva Balaji) బిగ్‌బాస్ -1 షోలో పాల్గొని ఫుల్ క్రేజ్ తెచ్చుకోవడంతో పాటు విజేతగా నిలిచి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ప్రజెంట్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఎంతో అన్నోన్యంగా ఉండే శివ బాలాజీ, మధుమిత(Madhumita) మధ్య కూడా చిన్న చిన్న గొడవలు వచ్చాయట.

దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోవాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ప్రముఖ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకులపై శివబాలాజీ, మధుమిత క్లారిటీ ఇచ్చారు. ‘‘నిజంగానే శివబాలాజీ విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ నేను బెదిరించడానికేనని అనుకున్నా కానీ ఏదో జరుగుతుందని మాత్రం అనుకోలేదు. ఆ సమయంలోనే మా పెద్ద బాబు పుట్టాడు. వాడిని చూడాలని శివకు బాగా ఉండేది. జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అప్పుడు మా అమ్మ వాళ్ల ఇంటికి వెళ్లాను.

ఈ క్రమంలోనే శివ బెంగళూరులోని తన కజిన్స్ దగ్గరికి వెళ్లగా .. వాళ్లకు నేను కనిపించకపోవడంతో డౌట్ వచ్చింది. నాకు కాల్ చేయమని చెప్పారట కానీ శివ చేయలేదు. దీంతో వాళ్లకు అసలు మ్యాటర్ అర్థం అయి ఇండియాకి వెళ్లి మధుని తీసుకురావాలని చెప్పారంట. దీంతో వెంటనే నాకు శివ కాల్ చేసి నన్ను రమ్మన్నాడు. కానీ నేను మాత్రం ఓ కండీషన్ పెట్టాను. నువ్వు మా ఇంటికి వచ్చి క్షమాపణలు చెబితేనే వస్తానని అన్నాను. కానీ ఆయన వచ్చాక అవేం పట్టించుకోకుండా తిరిగి మా బాబుతో మా ఇంటికి వెళ్లాము’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ మధు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story