- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అది కేసీఆర్ అయ్య జాగీరు కాదు: డి.శోభారాణి
దిశ, షాద్ నగర్: 'చరిత్రలో తుగ్లక్ గురించి విన్నం.. ఆయన పాలన గురించి చదివాం.. కానీ ఇప్పుడు తెలంగాణలో తుగ్లక్ పాలన కళ్ళారా చూస్తున్నామంటూ' భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డి.శోభారాణి అన్నారు. శనివారం షాద్ నగర్ పట్టణంలో బీజేపీ శక్తి కేంద్రం ఇంచార్జుల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే దళితున్ని సీఎం చేస్తామని చెప్పి మొదటి హామీనే కేసీఆర్ తుంగలో తొక్కారని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా శాసనసభలోనే అనేక అబద్ధాలు మాట్లాడుతూ ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై నిషేధం విధిస్తూ పరిపాలించడం కేసీఆర్ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. తెలంగాణ అసెంబ్లీ కేసీఆర్ అయ్య జాగీరు కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రగతిభవన్‌లో రాసుకున్న స్క్రిప్ట్ అసెంబ్లీలో అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళా గవర్నర్‌ను అవమానించడం కేసీఆర్ దుర్మార్గానికి పరాకాష్ఠ అని.. ప్రతి మహిళ సమ్మక్క, సారక్క, చాకలి ఐలమ్మలుగా మారి గుణపాఠం చెబుతారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో పీకే రాజకీయం వల్ల "పీకే"సేది ఏమీలేదని ఘాటుగా స్పందించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసులో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, డీకే అరుణలను ఇరికించి జైలుకు పంపే కుట్రపన్నారని ఆరోపించారు. భవిష్యత్‌లో కేసీఆర్‌ను జైలుకు పంపడం ఖాయమని హెచ్చరించారు.