ఆమె ఎప్పుడూ అలాగే చేస్తుంది.. అందుకే చివాట్లు పెట్టా.. స్టార్ హీరోయిన్‌‌పై నాగార్జున సంచలన కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-10-14 14:33:16.0  )
ఆమె ఎప్పుడూ అలాగే చేస్తుంది..  అందుకే చివాట్లు పెట్టా.. స్టార్ హీరోయిన్‌‌పై నాగార్జున సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని హీరో కింగ్ నాగార్జున గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. 60'S లో కూడా నవమన్మధుడులా అమ్మాయిల మనస్సు దోచేస్తున్నాడు. ప్రస్తుతం తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. అలాగే కొన్ని సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఇక రీసెంట్‌గా తెలంగాణ మంత్రి కొండా సురేఖ సమంత, నాగ చైతన్య, నాగార్జున పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో నాగార్జున ఆమెపై పరువు నష్టం కేసు వేశాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఈ క్రమంలో గతంలో నాగార్జున ఓ స్టార్ హీరోయిన్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయప్రద కొన్నేళ్ల క్రితం ‘జయప్రదం’ పేరుతో స్టార్స్‌ని ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా అక్కినేని నాగార్జున కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ షోలో పాల్గొన్న నాగార్జునను.. అలనాటి హీరోయిన్ జయప్రద కొందరి హీరోయిన్లు పేరు చెప్పి వారి గురించి అడిగింది. ఈ క్రమంలోనే మీతో పనిచేసిన హీరోయిన్లలో లేజీ ఎవరని ప్రశ్నించగా.. దానికి శ్రీయా అని నాగ్ ఆన్సర్ ఇచ్చారు. ఆ అమ్మాయి చాలా లేజీగా ఉంటుందని, షూటింగ్‌లకు లేట్‌గా వస్తుండటంతో తాను కూడా ఇబ్బందిపడినట్లు కింగ్ తెలిపారు. తానే పక్కన కూర్చోబెట్టుకుని సెట్‌లోనే చాలా సార్లు క్లాస్ పీకానని నాగార్జున వెల్లడించారు. ప్రస్తుతం నాగ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

Advertisement

Next Story