బెంగాల్ ఉపఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన మమతా బెనర్జీ

by Manoj |
బెంగాల్ ఉపఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన మమతా బెనర్జీ
X

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ఉపఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులను సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. మాజీ కేంద్ర మంత్రులు శత్రఘ్ను సిన్హా, బబుల్ సుప్రియో‌లు టీఎంసీ తరుఫున బరిలోకి దిగనున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఈ విషయాన్ని మమతా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. విలక్షణ నటుడు, మాజీ కేంద్రమంత్రి శత్రఘ్ను సిన్హా టీఎంసీ తరుఫున బరిలోకి దిగుతున్నారని ప్రకటించడం సంతోషంగా ఉంది.

ఆయన అసనోల్ నుంచి లోక్‌సభ ఉపఎన్నికల్లో బరిలోకి దిగుతారు. అంతేకాకుండా ప్రముఖ సింగర్, మాజీ కేంద్రమంత్రి బబుల్ సుప్రియో బల్లిగంజ్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగునున్నారు. జైహింద్. జై బంగ్లా' అని ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి నుంచి తొలిగించిన రెండు నెలలకే సుప్రియో టీఎంసీలో చేరారు. మరోవైపు 2019 ఎన్నికల్లో పాట్నా నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగిన సిన్హా ఓటమి పాలయ్యారు. కాగా, వచ్చే నెల 12‌న ఈ స్థానాలకు ఉపఎన్నిక జరగనుంది.

Next Story