'గంగూబాయి కతియావాడి'పై పేరెంట్స్ రియాక్షన్.. ఎమోషనల్ అయిన శాంతను

by Disha News Web Desk |
గంగూబాయి కతియావాడిపై పేరెంట్స్ రియాక్షన్.. ఎమోషనల్ అయిన శాంతను
X

దిశ, సినిమా: సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'గంగూబాయి కతియావాడి'. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ చిత్రంలో అజయ్ దేవగన్‌తో పాటు బుల్లితెర నటుడు శాంతను మహేశ్వరి కీలకపాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. కాగా సీరియల్ నుంచి సినిమాల్లోకి అరంగేట్రం చేయడంపై తన పేరెంట్స్ ఎమోషనల్ అయ్యారంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

'నేను ఓ చిత్రంలో నటిస్తున్నానని వారికి చెప్పాను. కానీ దాని పేరు ఇతరత్రా వివరాలేవి చెప్పలేదు. నేను చెప్పకుండానే గంగుబాయి సినిమాకు వెళ్లిన వాళ్లు.. స్క్రీన్‌పై నన్ను చూడగానే భావోద్వేగానికి లోనైనట్లు తెలిపారు. అంతేకాదు ఇంటికి రాగానే మూవీ బాగుందని, చుట్టుపక్కల వారందరినీ చూడాల్సిందిగా కోరారు' అని సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే తనకు ఈ అవకాశం ఇచ్చిన సంజయ్ లీలా భన్సాలీకి కృతజ్ఞుడనై ఉంటానన్న శాంతను.. ఆయనతో మరిన్ని ప్రాజెక్టుల్లో పనిచేయడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నానంటున్నాడు.

https://www.instagram.com/p/CabgGUfNEeB/?utm_source=ig_web_copy_link

Advertisement

Next Story