అమ్మాయి రూపంలో ఉన్నా పురుషుడి కోరికలున్నాయా? అయితే ఇది తెలుసుకోండి

by S Gopi |   ( Updated:2022-03-29 02:45:29.0  )
అమ్మాయి రూపంలో ఉన్నా పురుషుడి కోరికలున్నాయా? అయితే ఇది తెలుసుకోండి
X

దిశ, ఫీచర్స్: గత నెల గ్రేటర్ ఫరీదాబాద్‌లో 15ఏళ్ల స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. స్కూల్‌లో తోటి పిల్లలు తనను వెక్కిరిస్తున్నారని, సెక్సువాలిటీ విషయంలో వేధిస్తున్నారని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దురదృష్టవశాత్తు దేశంలో ఇలాంటి కేసులు లెక్కకుమించి నమోదవుతుండగా.. సెక్స్ ఎడ్యుకేషన్‌పై ఇండియన్ స్కూల్స్‌లో అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమనేది సత్యం. దీంతో సెక్స్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యతపై చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.

సెక్స్ ఎడ్యుకేషన్ అంటే లైంగికత, గర్భనిరోధకం గురించిన అవేర్‌నెస్ కార్యక్రమాలే అనుకుంటారు కానీ, ఇందులో సెక్సువల్ హెల్త్‌ను కూడా చేర్చాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. స్కూలింగ్‌లో బాడీ పార్ట్స్, రీప్రొడక్టివ్ సిస్టమ్, HIV/AIDS టాపిక్స్ మాత్రమే బయాలజీ బోధిస్తుందని.. సెక్సువాలిటీ, జెండర్ ఇంపార్టెన్స్ గురించి వివరించడం లేదని అభిప్రాయపడుతున్నారు. అసలు సెక్స్‌-జెండర్ మధ్య తేడాలపై స్కూల్ పిల్లలే కాదు సమాజంలో చాలా మందికి సరైన అవగాహన లేదంటున్నారు. ఇంతకీ సెక్స్-జెండర్ మధ్య డిఫరెన్స్ ఏంటి? తెలుసుకుని ఏవిధంగా సపోర్ట్ చేయొచ్చు?

సెక్స్

మనిషి లేదా జంతువుల బయోలాజికల్ క్యారెక్టర్ బేస్ చేసుకుని 'సెక్స్'ను కేటగరైజ్ చేస్తుంటారు. ఇది ఫిజికల్, సైకలాజికల్(క్రోమోజోమ్స్, హార్మోన్ లెవల్స్, ఫంక్షన్స్, జీన్స్) ఫీచర్స్‌పై ఆధారపడి ఉంటుంది. నిజానికి ఓ వ్యక్తి పుట్టగానే పునరుత్పత్తి అవయవాల ఆధారంగా 'ఆడ లేదా మగ' అని డిసైడ్ చేస్తారు. కానీ కొందరు ఇంటర్‌సెక్స్ చైల్డ్‌గా పుడతారు. మరి వారిని ఏమనాలి? అనేదే 'సెక్స్Vs జెండర్‌' చర్చకు దారితీసింది. ప్రజలు సెక్స్, జెండర్ పదాలను నార్మల్‌గా యూజ్ చేస్తారు కానీ.. అది కరెక్ట్‌ కాకపోవచ్చు.

జెండర్

ఇక జెండర్ అనేది వ్యక్తి ప్రైవేట్ ఆర్గాన్ మీద ఆధారపడదు. ఆ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నాడు? దేహం అబ్బాయిగా ఉన్నప్పటికీ అమ్మాయి లక్షణాలు ఉన్నాయా? అమ్మాయి రూపంలో ఉన్నా పురుషుడి కోరికలున్నాయా? అనేది జెండర్‌ను నిర్ణయిస్తుంది. ఈ క్రమంలోనే 'మేల్, ఫిమేల్, ట్రాన్స్‌జెండర్, జెండర్ న్యూట్రల్, బైనరీ' వంటి అనేక జెండర్ ఐడెంటిటీస్ ఉన్నాయి.

ధరించే దుస్తులు, హెయిర్ స్టైల్, మేకప్, ఫుట్‌వేర్, టాయ్స్ బేస్ చేసుకుని.. ఆ మనిషి అబ్బాయి లేదా అమ్మాయి అని నిర్ణయిస్తున్నారు. శతాబ్దాలుగా ఇదే కొనసాగుతుండగా.. ఈ జెండర్ స్టీరియోటైప్స్ బ్రేక్ చేయాలని, తమ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయాలని కోరుతున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే ఈ జెండర్ బ్రిడ్జ్ గ్యాప్‌ను ఫిల్ చేసేందుకు కేరళ గవర్నమెంట్ స్కూల్స్ 'జెండర్ న్యూట్రల్' యూనిఫామ్స్ తీసుకురాగా.. స్కూల్ కరిక్యులమ్‌లో ఎల్‌‌జీబీటిక్యూ కమ్యూనిటీని చేర్చాలని మద్రాస్ హైకోర్టు గతేడాది తీర్పునివ్వడం విశేషం.


క్యాబ్ ప్రయాణికులకు షాక్.. ఏసీ కావాలంటే అదనపు బాదుడు

Advertisement

Next Story