క్యాబ్ ప్రయాణికులకు షాక్.. ఏసీ కావాలంటే అదనపు బాదుడు

by Sathputhe Rajesh |   ( Updated:2022-03-29 01:53:35.0  )
క్యాబ్ ప్రయాణికులకు షాక్..  ఏసీ కావాలంటే అదనపు బాదుడు
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసలే వేసవి. బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఈ వేడిమి నుంచి తప్పించుకునేందుకు నగరవాసులు క్యాబ్​లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్​ధరల దృష్ట్యా ఓలా, ఊబర్ క్యాబుల్లో ఏసీ వేయకూడదని క్యాబ్​డ్రైవర్ల అసోసియేషన్​నిర్ణయించింది. ఏసీ కావాలంటే అదనంగా చెల్లించాల్సిందేనని క్యాబ్​డ్రైవర్లు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, లక్నో, మహారాష్ట్ర, ఢిల్లీలో 'స్విచ్​ఆఫ్​ఓలా, ఊబర్​ఏసీ' అనే క్యాంపెయిన్​ను ఏర్పాటుచేసి దీనిని అమలు చేస్తున్నారు. కాగా నేటి నుంచి హైదరాబాద్ లో కూడా 'స్విచ్​ఆఫ్​ఓలా, ఊబర్​ఏసీ' విధానాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటికే మూడురోజులుగా స్పెషల్​క్యాంపెయిన్​ను క్యాబ్​డ్రైవర్ల అసోసియేషన్​చేపడుతోంది. 25 కిలోమీటర్ల వరకు రూ.50, 25 నుంచి 50 కిలోమీటర్ల దూరానికి రూ.100 చెల్లించాలని కస్టమర్లకు విజ్ఞప్తి చేస్తున్నాయి.

ఓలా, ఊబర్​సంస్థలు ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారం ధరలు చెల్లించకపోవడం, ప్రభుత్వం కూడా ఆ సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు క్యాబ్​డ్రైవర్ల అసోసియషన్​నాయకులు చెబుతున్నారు. ఏసీ ఆన్​చేయడం ద్వారా పెట్రోల్, డీజిల్​మరింతగా వినియోగించాల్సి వస్తుంది. అసలే ఇప్పుడు వేసవి కావడంతో వేసవి తాపం నుంచి తప్పించుకోవాలంటే ఇంధనం బాగా ఖర్చవుతుంది. ఇప్పటికే కొవిడ్​తో ఆర్థిక కష్టాల్లో ఉన్న క్యాబ్​డ్రైవర్లకు ఇది మరింత భారంగా మారే అవకాశమున్న నేపథ్యంలో క్యాబ్​డ్రైవర్ల అసోసియేషన్​ఈ నిర్ణయానికి వచ్చింది. క్యాబ్​డ్రైవర్ల కష్టాలు చెప్పుకుందామంటే ఓలా, ఊబర్​సంస్థ ప్రతినిధులు తమ మొరను కనీసం పట్టించుకోవడం లేదంటూ వారు వాపోతున్నారు.

క్యాబ్​డైవర్ల అసోసియేషన్​తీసుకున్న నిర్ణయంతో ప్రయాణీకులపై భారీగా భారం పడే అవకాశాలున్నాయి. అయితే తొలుత తాము 'స్విచ్​ఆఫ్​ఓలా, ఊబర్​ఏసీ' అనే క్యాంపెయిన్​ను పైలెట్​ప్రాజెక్టు కింద వెస్ట్ బెంగాల్, లక్నో, ఢిల్లీ, మహారాష్ట్రలో చేపట్టామని, ప్రయాణికుల నుంచి కూడా పాజిటివ్​రెస్పాన్స్​వచ్చిందని క్యాబ్​డ్రైవర్లు చెబుతున్నారు. తమకు కస్టమర్లు దేవుళ్లని, వారిని ఇబ్బంది పెట్టే పని ఏది చేయబోయేది లేదని వాపోయారు. ఇప్పుడు పెరిగిన పెట్రోల్, డీజిల్​ధరలకు అనుగుణంగా ప్రయాణికులు కూడా క్యాబ్​డ్రైవర్ల బాధలు తెలుసుకుని అదనంగా డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే ఓలా, ఊబర్​యాప్ లలో పెంచిన ధరలు చూపిస్తే ఇస్తామని చెబుతున్నట్లుగా క్యాబ్​డ్రైవర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయాన్ని అటు ప్రభుత్వానికి, రవాణా శాఖ మంత్రి, కమిషనర్​కు చెబుదామని అపాయింట్​మెంట్ కోరినా పట్టించుకున్న పాపాన పోలేదని చెబుతున్నారు. గతంలోనే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఓలా, ఊబర్​వంటి సంస్థలకు క్యాబ్​డ్రైవర్ల వద్ద నుంచి 20 శాతం కంటే ఎక్కువ కమిషన్​తీసుకోవద్దని మోటార్​వెహికిల్​అగ్రిగేటర్​గైడ్​లైన్స్​2020 లో స్పష్టం చేసిందని, అయినా వీరు ఎలాంటి నిబంనధనలు పాటించడంలేదని క్యాబ్​డ్రైవర్లు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్​లో 'స్విచ్​ఆఫ్​ఓలా, ఊబర్​ఏసీ' చేపట్టిన అనంతరం ఈ గైడ్​లైన్స్ ను అక్కడి ప్రభుత్వం ఫాలో అవుతోందని వాపోయారు. తెలంగాణలోనూ ఇదే విధానాన్ని పాటించేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం 2016లో జీవో 61, 66లో ప్రీపెయిడ్​టాక్సీలకు కిలోమీటర్​కు రూ.17 ఇవ్వాలని పలు సంస్థలకు స్పష్టం చేశాయి. అయితే అవేమీ పట్టించుకోకుండా ఓలా, ఊబర్​సంస్థలు కిలోమీటర్​కు రూ.12 మాత్రమే చెల్లిస్తున్నాయని క్యాబ్​డ్రైవర్ల అసోసియేషన్​చెబుతోంది. డ్రైవర్లకు ఇచ్చే కిలోమీటర్​రేటు ఓలా, ఊబర్​కంపెనీలు పెంచడంలేదని వారు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఓలా, ఊబర్​సంస్థలు క్యాబ్​డ్రైవర్ల నుంచి ప్రతి రైడ్​పై 25 శాతం నుంచి 30 శాతం వరకు కమిషన్​తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్​రేట్లు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. 2016 లో తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చిన నాటికి పెట్రోల్, డీజిల్​రేట్లు చాలా అత్యల్పంగా ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం ఫిక్స్​చేసిన రేటు ప్రకారం ప్రీపెయిడ్​టాక్సీలకు రేట్లు అందించకపోగా ఇప్పుడు పెరిగిన పెట్రోల్, డీజిల్​ప్రకారం కూడా ప్రభుత్వం జీవోను సవరిస్తూ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఓలా, ఊబర్ సంస్థలపై కనీసం చర్యలు కూడా తీసుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. పెట్రోల్, డీజిల్​లీటరు దర సెంచరీ దాటిపోయింది. ఇప్పుడున్న రేట్లకు అనుగుణంగా ప్రతి కిలోమీటర్​కు కనీసం రూ.25 ఇవ్వాలని ఓలా, ఊబర్​సంస్థలు, ప్రభుత్వానికి క్యాబ్​డ్రైవర్లు డిమాండ్​చేస్తున్నారు.

ప్రయాణికులను ఇబ్బంది పెట్టం

హైదరాబాద్​లో మూడు రోజుల కింద 'స్విచ్​ఆఫ్​ఓలా, ఊబర్​ఏసీ' క్యాంపెయిన్​ను ప్రారంభించాం. మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నాం. కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. చాలా మంత్రి ప్రయాణికులు మా బాధను అర్థం చేసుకుంటున్నారు. బైక్​రైడ్లు, ఆటో చార్జీల కంటే తక్కువగా ఓలా, ఊబర్ లో క్యాబ్​డ్రైవర్లకు చెల్లిస్తున్నారు. డ్రైవర్లు బతికేదెలా? ప్రయాణికులైనా స్పందించి మా కష్టాల గురించి ఓలా, ఊబర్​సంస్థలకు మెయిల్, మెసేజ్​పెట్టి మా బాధలను తెలియజేయండి. కస్టమర్లను ఇబ్బంది పెట్టాలనేది మా ఉద్దేశ్యం కాదు. మా కష్టాలను అర్థం చేసుకోండి- సలాఉద్దీన్, తెలంగాణ గిగ్, ప్లాట్​ఫాం వర్కర్స్​యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు

Advertisement

Next Story