- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెలసరి సమయంలో సెక్స్.. ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా?
దిశ, ఫీచర్స్ : పీరియడ్స్ టైమ్‌లో మహిళలు అధిక రక్తస్రావం, నొప్పిని అనుభవిస్తూ అసౌకర్యాన్ని ఎదుర్కొంటారని తెలిసిందే. ఇలాంటి టైమ్‌లో చాలామంది తమ భాగస్వామితో శృంగారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపించరు. కొందరు ఈ సమయంలో సెక్స్ చేయడాన్ని ఇష్టపడినప్పటికీ ఏమైనా సమస్యలు తలెత్తుతాయా? అని సందేహిస్తుంటారు. ఈ క్రమంలోనే బుర్రలో అనేక ఆలోచనలతో సతమతమవుతుంటారు. ఈ నేపథ్యంలో పీరియడ్ సెక్స్ వల్ల కలిగే ప్రయోజనాలు, ఇబ్బందుల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
లాభాలు :
* పీరియడ్స్ టైమ్‌లో రతి క్రీడలో పాల్గొనడమనేది కపుల్స్ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఇద్దరికీ ఇష్టమైతే ఆనందంగా సెక్స్‌లో పాల్గొనవచ్చు.
* నెలసరి సమయంలో శృంగారం చేస్తే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కానీ ఇందుకోసం హైజీన్ మెయింటైన్ చేయడంతో పాటు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
* సెక్స్‌లో పాల్గొన్నపుడు 'ఆక్సిటోసిన్' అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీనిని బాండింగ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. వీటితో పాటు ఎండోమార్మిన్ అనే మరో హార్మోన్ కూడా విడుదలవుతుంది. ఇవి భావప్రాప్తి తర్వాత అధిక స్థాయిలో రిలీజ్ అవుతాయి. కాబట్టి నెలసరి నొప్పులు, తిమ్మిర్ల బాధను తగ్గిస్తాయి.
* చాలామంది మహిళలు పీరియడ్స్ సమయంలో మైగ్రైన్‌తో ఇబ్బందిపడుతుంటారు. అలాంటివారికి శృంగారం ఉపశమనాన్ని ఇచ్చే అవకాశం ఉంది.
ఇబ్బందులు :
* HIV, గనేరియా, హెపటైటిస్ బి వంటి డిసీజెస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది.
* గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌కు కారణమైన హ్యూమన్ పాపిలోమా వైరస్ సోకే అవకాశం ఎక్కువ.
* ఈ సమయంలో సెక్స్‌లో పాల్గొనడం వల్ల STD(సెక్సువల్ ట్రాన్సిమిషన్ డిసీజెస్) సంక్రమించే వీలుంది.
ఇక వీటిపై ఎటువంటి అనుమానాలు, అపోహాలు ఉన్నట్లయితే వైద్యుడిని సంప్రదించాలి.