CNG, వంట గ్యాస్‌ లైసెన్స్‌కు 21 బిడ్‌లు: PNGRB

by Harish |   ( Updated:2022-04-09 12:43:03.0  )
CNG, వంట గ్యాస్‌ లైసెన్స్‌కు 21 బిడ్‌లు: PNGRB
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి ఐదు ప్రాంతాలలో ఆటోమొబైల్‌లకు CNG, గృహాలకు పైపుల ద్వారా వంట గ్యాస్‌ను రిటైల్ చేయడానికి లైసెన్స్ కోసం ఏడు కంపెనీలు 21 బిడ్‌లను దాఖలు చేశాయని చమురు నియంత్రణ సంస్థ PNGRB తెలిపింది. ఐదు రాష్ట్రాల్లోని 27 జిల్లాల్లో విస్తరించి ఉన్న ఐదు భౌగోళిక ప్రాంతాల (GAs)కోసం పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ (PNGRB) 11A సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) బిడ్‌ను ఆఫర్ చేసింది. ఐదు భౌగోళిక ప్రాంతాల కోసం బిడ్‌లు ఏప్రిల్ 6న అందాయని PNGRB ఒక ప్రకటనలో తెలిపింది. 11A బిడ్ రౌండ్‌లో అందించబడిన GAలలో ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ, సీతాపూర్, సిద్ధార్థ్ నగర్ మహారాజ్‌గంజ్ జిల్లాలు ఒక GAగా ఉన్నాయి. బీహార్‌లోని బంకా, జార్ఖండ్‌లోని దుమ్కా, గొడ్డా, సాహిబ్‌గంజ్ జిల్లాలు ఒక GAగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో, బీర్భూమ్, మురిష్దాబాద్, మాల్దా దక్షిణ్ దినాజ్‌పూర్ జిల్లాలను ఒక GAగా చేర్చారు. ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా, సూరజ్‌పూర్, బల్రాంపూర్, సుర్గుజా జిల్లాలు ఒక GAగా, కొండగావ్, బస్తర్, సుక్మా, నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ లను మరొక GA గా చేర్చారు.

Advertisement

Next Story