- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేనున్నా.. ఖమ్మంలో రౌడీషీటర్లకు 'ఆంజనేయ' అభయం..!!
దిశ నిఘా ప్రతినిధి: ఇటీవల ఖమ్మం జిల్లాలో సెటిల్మెంట్లు, భూ దందాలు ఎక్కువయ్యాయి. చిన్న చిన్న పంచాయితీల నుంచి ల్యాండ్ గొడవలు, ఆర్థిక లావాదేవీల వరకు అన్నింట్లో రౌడీలు ఎంటరయ్యి సెటిల్మెంట్లు చేస్తున్నారు. అయితే సామరస్యంగా, పోలీస్ స్టేషన్లు, కోర్టుల ద్వారా పరిష్కారం కావాల్సిన గొడవలు.. బెదిరింపులు, దాడులు చేసి లొంగదీసుకోవడం వంటివాటితో ముగుస్తున్నాయి. ఇలా ఖమ్మం నగరంతో పాటు పలు ప్రాంతాల్లో భారీగా రౌడీలతో సెటిల్మెంట్లను స్వయంగా ఓ ఏసీపీ స్థాయి పోలీస్ ఉన్నతాధికారే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. రౌడీ గ్యాంగులకు ఆయనే గొడవలు చేయాలని పురమాయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. లేని పంచాయితీలను సృష్టించడం, రౌడీలను పంపి సెటిల్ చేయడం.. ఇరు వర్గాలను నుంచి భారీగా డబ్బు దండుకోవడం ఆ పోలీస్ ఉన్నతాధికారికి పరిపాటిగా మారిందనే విమర్శలు వస్తున్నాయి.
ల్యాండ్ గొడవల్లో తలదూర్చుతూ..
ఖమ్మం నగరం రోజురోజుకూ విస్తరిస్తుండడంతో రియల్ వ్యాపారం పుంజుకుంది. భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. దీంతో భూ తగాదాలు కూడా ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్లకు చేరే పంచాయితీల్లో సదరు ఉన్నతాధికారి జోక్యం చేసుకోవడం రౌడీలను సెటిల్ చేయాల్సిందిగా పంపించడం చేస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. రౌడీలు ఓ వర్గం వారితో మాట్లాడుకుని మరో వర్గం వారిని బెదిరించి మరీ పంచాయితీని సెటిల్ చేస్తున్నారు. తర్వాత ఇంకో వర్గం వారి నుంచి డబ్బులు భారీగా వసూలు చేయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా ఏవైనా ఆర్థిక లావాదేవీల పంచాయతీలైనా సరే ఈ పోలీస్ ఉన్నతాధికారి తలదూర్చి రౌడీలను పంపించి సెటిల్మెంట్ చేయిస్తూ భారీగా డబ్బులు కూడబెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఆ ఉన్నతాధికారి హవా..
సదరు ఉన్నతాధికారి ఏసీపీ స్థాయి అధికారి కావ డంతో ఖమ్మంలోని కొన్ని రౌడీ గ్యాంగులను పెంచిపోషిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఏవైనా గొడవలు చేయించాల్సి వస్తే వారికి పురమాయించి పని పూర్తిచేయిండం.. బాధితుల వద్ద మళ్లీ ఆ పోలీస్ ఉన్నతాధికారే సెటిల్ చేయించడం.. లక్షల్లో డబ్బులు బాదడం ఆయనకు పరిపాటిగా మారింది.. వచ్చిన డబ్బుల్లోంచి కొంత పనిచేసిపెట్టిన రౌడీ గ్యాంగుకు ఇస్తుంటాడని టాక్.. అన్ని స్టేషన్లలో ఈ పెద్దసారుదే హవా అనే ప్రచారం జరుగుతోంది. ఆయా పోలీస్ స్టేషన్లకు వచ్చిన భూ పంచాయితీ, పెద్దపెద్ద గొడవల వంటివాటిలో స్వయంగా ఈయనే తలదూర్చి సెటిల్ చేసినట్లు చేసి వారిని మరింత ఇబ్బందులు పెడుతాడని కొంత మంది బాధితులు చెప్పడం గమనార్హం.
ఖమ్మంలో రౌడీయిజాన్ని పెంచిపోషిస్తున్నారు..
ఖమ్మంలో రౌడీలను సదరు పోలీస్ ఉన్నతాధికారే పెంచి పోషిస్తున్నారని వీడియో రిలీజ్ కావడం గమనార్హం. ఓ ఏసీపీ స్థాయి ఉన్నతాధికారి కోసమే తాను సెటిల్మెంట్లు చేశానని వీడియో రిలీజ్ చేసిన వ్యక్తి చెప్పాడు. తాను లేని గొడవల్ని సృష్టిస్తూ సెటిల్మెంట్ల పేరుతో తమను పంపి.. బాధితులను బెది రించి పని పూర్తిచేయించేలా పురమాయిస్తాడని స్వ యంగా చెప్పడం గమనార్హం. ఖమ్మంలో సుమారు నాలుగు రౌడీ గ్యాంగులను పోలీస్ ఉన్నతాధికారి పోషిస్తున్నారని, వారి ద్వారానే అన్ని పనుల చేయిస్తుంటాడని అతను చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. వసూలు చేసిన డబ్బులో 10 పర్సెంట్ కూడా తమకు ఇస్తుంటాడని, గతంలో ఖమ్మంలో రౌడీయిజం తక్కు వగా ఉందని, సదరు పోలీస్ ఉన్నతాధికారి వచ్చాకే ఎక్కువయిందని చెప్పడం విశేషం.