Sai Dharam Tej: SDT18 అప్డేట్ రిలీజ్ చేసిన మెగా హీరో.. కాంబో అదుర్స్ అంటున్న నెటిజన్లు

by Hamsa |   ( Updated:2024-11-05 12:58:27.0  )
Sai Dharam Tej: SDT18 అప్డేట్ రిలీజ్ చేసిన మెగా హీరో.. కాంబో అదుర్స్ అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) ‘విరూపాక్ష’ మూవీతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రజెంట్ ఈ యంగ్ హీరో ‘SDT18’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ చిత్రంతో రోహిత్ కోపీ (Rohit kopi) దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ‘హనుమాన్’ తో పాన్ ఇండియా నిర్మాతలుగా మారిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

1947 హిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ(Aishwarya Lakshmi) మెగా హీరో సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ‘SDT18’ నుంచి విడుదలైన అప్డేట్స్ అన్ని భారీ అంచనాలను పెంచాయి. అయితే షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తున్నారు మేకర్స్. తాజాగా, సాయి ధరమ్ తేజ్ ‘X’ వేదికగా SDT18 నుంచి ఓ పోస్టర్‌‌ను షేర్ చేశారు. ఇందులో జగపతి బాబు విలన్‌గా నటిస్తున్నట్లు వెల్లడించారు.

అంతేకాకుండా ఆయన లుక్‌ను పోస్ట్‌లో పెట్టారు. ఈ పోస్టర్‌లో గుబురు గడ్డం.. సీరియస్ లుక్‌లో జగ్గూ బాయ్ కనిపించారు. ఇక ఈ పోస్ట్ చూసిన వారంతా అసలు సిసలైన విలన్‌ని పట్టేశారు కాంబో అదుర్స్ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఇప్పటికే సాయి ధరమ్ తేజ్, జగపతి బాబు(Jagapati Babu) ‘పిల్లా నువ్వు లేని జీవితం’ విలన్‌గా నటించారు. ఇక ‘విన్నర్’(winner) సినిమాలో తండ్రిగా నటించగా.. ఇప్పుడు మళ్లీ విలన్‌గా SDT18‌లో నటిస్తున్నాడు. ఈ కాంబో మూడోసారి రిపీట్ కానుంది.

Advertisement

Next Story